రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని, 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు దుష్పరిపాలన ప్రభావం వల్లే ఆత్మహత్యలు కొనసాగాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తాజాగా ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి హాయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో 16 వందల 23 మండలాలను కరువుగా ప్రకటించారని, గత మూడేళ్ళలో కరువు మండలాలు లేవన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
రైతులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఎంత చేశారో చెప్పాలన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
లక్ష కోట్లయినా రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారని, బంగారు రుణాలకూ వర్తింప చేస్తామన్నారన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆయన హామీలు నెరవేర్చక పోవడంతో అప్పుల ఊబిలో రైతులు కూరుకు పోయారని, జగన్ ఇచ్చిన హామీ లన్నింటినీ నెరవేరుస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వరుసగా 4 ఏళ్లుగా జలాశయాలు నిండుతున్నాయని, గతంలో కంటే 14 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతోందన్నారు. చంద్రబాబు హయాంలో జలాశయాలకు నీరు రాలేదని, రైతులు పంట నష్టపోతే బీమా ఇస్తున్నామన్నారు. ‘ఇన్ పుట్ సబ్సిడీ ని అదే సీజన్ లో ఇస్తున్నామని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమలు చేస్తున్నామని, రైతుల ఆత్మహత్యలకు చెందిన బకాయిలను కూడా జగన్ వచ్చిన తర్వాత చెల్లించారన్నారు. వ్యవసాయం దండగ అన్నారు..ఇప్పుడు ఉచిత విద్యుత్.ఇస్తానని అంటున్నారు. చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకున్నారన్నారు.