చంద్రబాబు సంస్కరణలు తెస్తే జగన్ రెడ్డి విధ్వంసం చేశాడు : కళా వెంకట్రావు

-

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావునేడు ఒక సభలో మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆయన మాట్లాడుతూ, విద్యుత్ రంగంలో చంద్రబాబు సంస్కరణలు తెస్తే జగన్ రెడ్డి విధ్వంసం చేశాడని మండిపడ్డారు. కరెంటు కోతలు, చార్జీల మోతతో ప్రజలపై భారం మోపడం పెత్తందారు పాలన కాదా? అని అడిగారు. విద్యుత్ రంగంలో విప్లవం తెస్తానని విపక్షంలో ఉన్నప్పుడు ప్రవచనాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మోసం చేశాడని మండిపడ్డారు వెంకట్రావు.

“వేళాపాళా లేని విద్యుత్ కోతలు, చార్జీల మోతతో ప్రజలపై భారం మోపుతున్నాడు. ఏపీలో కరెంటు లేక బట్టలారేసుకుంటున్నారన్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు వింటే జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా? అని అడిగారు. చంద్రబాబు గారు సాధించిన నిరంతర విద్యుత్ సరఫరాకు గండి కొట్టడం జగన్ రెడ్డి పాలనా అసమర్థతకు నిదర్శనం కాదా? అని నిలదీశారు. ఒక్క చాన్స్ ఇస్తే 9 గంటల ఉచిత విద్యుత్ తో పాటు విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై రూ. 57 వేల కోట్లకు పైగా భారం వేయడం పెత్తందారు పాలన కాదా? నెలవారీ బిల్లు చూస్తుంటే స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంటు షాక్ కొట్టడం వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు వెంకట్రావు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version