ఏపీలో పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి ఆయన్ని వ్యక్తిగతంగానే వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ మధ్య విశాఖ ఘటన నుంచి పవన్ రివర్స్ అయ్యారు..వైసీపీ నేతలకు..వల్ల బాషలోనే సమాధానం చెప్పారు. అలాగే ఇప్పటం ఎపిసోడ్‌తో మరో మెట్టు ఎక్కారు. ఎక్కడా తగ్గకుండా పవన్ దూకుడుగా వైసీపీపై పోరాటం చేస్తున్నారు.
అయితే పవన్ వల్ల వైసీపీకి ఎంతోకొంత ఇబ్బంది ఉందని చెప్పొచ్చు. పవన్, చంద్రబాబుతో కలిసి ఎన్నికల బరిలోకి వెళితే జగన్‌కు రిస్క్ తప్పదు. ఆ విషయంలో వైసీపీకి బాగా తెలుసు. అందుకే పవన్‌ని ఎంత తక్కువ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల టెన్షన్ పడుతున్న సరే పైకి మాత్రం పవన్‌కు పెద్ద విలువ లేదన్నట్లు మాట్లాడుతున్నారు.
ఇక ఇప్పటికే పలుమార్లు పవన్‌ని తిట్టిన మంత్రి రోజా..తాజాగా కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఓ కరివేపాకు లాంటి వాడు అని మాట్లాడారు. ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉందని, ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే..ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న నారా లోకేష్ వెళ్లాలని..పవన్ కల్యాణ్‌ని కరివేపాకులా ముందుకు తోశారని విమర్శించారు. జనసేన అంటే సైకో సేనలా, రౌడీలా మాదిరిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
అయితే రోజాకు అదే స్థాయిలో జనసేన నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. కరివేపాకు ఎవరో 2024లో తేలుతుందని, అయిన కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు వేరు అని, అలాగే పవన్‌తో ప్రజలకు మేలు అని అంటున్నారు. ఇక మంగళగిరి టీడీపీ ఇంచార్జ్‌గా లోకేష్ ఉంటే..ఓ పార్టీ అధినేత పవన్ ఎక్కడికైనా వెళ్తారని, ఆ విషయం రోజా తెలుసుకోవాలని, ఇక రౌడీ మూకలు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని కౌంటర్లు ఇచ్చారు. ఏదేమైనా గాని పవన్‌ని వైసీపీ తక్కువ అంచనా వేస్తుంది..కానీ అదే పవన్‌తో వైసీపీకి రిస్క్ ఉంది..టీడీపీతో కలిస్తే వైసీపీ కొంపముంచుతాడు.