అఫీషియల్: రజనీకాంత్ దర్శకుడితో కమల్ హాసన్ నెక్స్ట్ ఫిల్మ్

-

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విక్రమ్’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ఫిల్మ్ గురించీ ప్లాన్ చేసుకున్నాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. కాగా, తన తర్వాత చిత్రం రజనీకాంత్ ను డైరెక్ట్ చేసిన పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆ చిత్ర స్టోరి గురించి చర్చించినట్లు తెలుస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్. వీరిరువురికి సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

పా.రంజిత్..తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తో రెండు చిత్రాలు చేశారు. ‘‘కబాలి, కాలా’’.. ఈ రెండు ఫిల్మ్స్ లోనూ రజనీని చాలా స్టైలిష్ గా చూపించారు రంజిత్. కాగా, కమల్ హాసన్ తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందోననే సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ ఫిల్మ్ లో మాలీవుడ్ (మలయాళ) స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ (ఫఫ), కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version