గాయపడిన కేన్ విలియమ్సన్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఫీల్ అవుతారు…!

-

ఐపీఎల్ 2023 లో మొదటి మ్యాచ్ లో గుజరాత్ మరియు చెన్నై ల మధ్యన మ్యాచ్ లో అనుకోకుండా బౌదరీని ఆపాలని ప్రయత్నించిన గుజరాత్ ప్లేయర్ మరియు కివీస్ లెజెండ్ కేన్ విలియమ్సన్ కు కాలుకి గాయం అయింది. కానీ ఆ గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.. తన అభిమానులు అంతా మళ్ళీ మైదానంలోకి వస్తాడు అని కలలు కన్నారు. కానీ పక్కరోజునే తెలిసింది.. అది ఏమంత చిన్నా గాయం కాదని ఐపీఎల్ సీజన్ లో మళ్ళీ ఆడే అవకాశమే లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు.

దీనితో ఇక ఇండియాలో ఉండి చేసేది ఏమీ లేక విలియమ్సన్ తిరిగి తన దేశానికి బయలుదేరాడు. ప్రస్తుతం ఇంస్టాల్ లో షేర్ చేసిన ఒక పోస్ట్.. అభిమానులను ఎంతగానో బాధపెడుతోంది. ఈ ఫొటోలో ఒక కాలికి కట్టు కట్టుకుని రెండు చేతి కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇంతబాధలోనూ తనకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టడం అతని సంస్కారానికి ప్రతీక అని చెప్పాలి. ఇక ఫ్యాన్స్ కూడా గెట్ వెల్ కేన్ మామ అంటూ కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version