కన్నడ సినిమా కాంతార రికార్డుల మోత ఇంకా కొనసాగుతోంది. సెప్టెంబరు 30న కర్ణాటకలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని.. అక్టోబరులో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలైంది. కాంతార సినిమా ఇప్పటికే అనేక భాషల్లో అనేక రికార్డ్స్ నెలకొల్పి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది..తాజాగా తెలుగు లో అరుదైన రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబరు 30న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని.. అక్టోబరులో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తెలుగులోనే ఏకంగా రూ.65 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా వెళుతుంది. తెలుగులో కలెక్షన్ల పరంగా చూసుకుంటే అత్యధికంగా వసూలు చేసిన డబ్బింగ్ సినిమా జాబితాలో కాంతార నాలుగవ స్థానంలో నిలిచింది. కేజీఎఫ్-2 మూవీ తెలుగులో రూ.185 కోట్లని కలెక్ట్ చేయగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రొబో, రొబో 2.0 వరుసగా రూ.100 కోట్లు, రూ.72 కోట్లతో టాప్-3లో ఉన్నాయి. తాజాగా ‘కాంతార’ రూ.65 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లలో కాంతారా మూవీ కొనసాగుతుంది. విడుదలైన అన్నీ సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.