‘కాంతారా’ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్

-

ఈ మధ్యకాలంలో కన్నడ చిత్రాలు సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. మొదట కేజి ఎఫ్ సినిమా నుంచి విడుదలైన చిత్రాలలో విక్రాంత్ రొణ, చార్లీ-777, కాంతారా వంటి చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా చిన్న చిత్రంగా కన్నడ లో విడుదలైన కాంతారా సినిమా ఒక్కసారిగా సక్సెస్ను సాధించి పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.

కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే OTT రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి వరాహ రూపం ఒరిజినల్ వర్షం సాంగ్ కోసం ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రైమ్ వారిని అలాగే కాంతారా నిర్మాతలను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా వారందరికీ మంచి బూస్ట్ నిచ్చేలా నేడు వరాహ రూపం సాంగ్ పై స్పందించారు దర్శకుడు అలాగే నటుడు రిషభ్ శెట్టి. ఆయన మాట్లాడుతూ దేవుడి దయవలన కోర్టు కేసు గెలిచాం. అతి త్వరలోనే ఒరిజినల్ వర్షన్  వరాహ రూపం సాంగ్ ను ఓటీడీలో కూడా యాడ్ చేస్తామంటూ రిశభ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version