కార్తీక దీపం : దీపతో కార్తీక్ ఆవేదన… మోనిత బతికే ఉంది?? అసలేం అయ్యింది..!

-

Karthika Deepam  September 1st Episode : కార్తీక దీపం కధ అయ్యిపోతుందేమో అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి కధని సాగదీస్తూనే ఉన్నారు. అయితే కార్తీక్ జరిగింది తెలుసుకుని బాధపడుతున్న సమయంలో గట్టిగా అరుస్తాడు. అక్కడే జ్యూస్ తీస్తున్న దీప వెంటనే డాక్టర్ బాబు ఏమైంది అని వస్తుంది. దీనితో డాక్టర్ బాబు నేను పిరికివాడ్ని కాదు దీపా.. కానీ నేను నా కుటుంబం విషయంలో పిరికివాడ్నే.. ఏ ఒక్కరినీ దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్తాడు.

Karthika Deepam | కార్తీక దీపం

అలానే పాముతో స్నేహం చేశాను. ఆ పాము నన్ను కాటేసినా ఫర్వాలేదు. కానీ దాని వలన కుటుంబం అంతా ప్రమాదంలోకి వస్తోంది. కానీ నా కుటుంబం మీద కాటు పడనివ్వను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో దీప నొప్పి తగ్గిందా అని అడుగుతుంది. హా అని అంటాడు. మరి ఎందుకు అలా ఉన్నారు? అని దీప అడగడంతో.. బాగుండాలి.. అందరూ బాగుండాలి.. ఈ రాత్రికి ఎక్కడికి వెళ్లకు అని చెప్తాడు. కానీ మనసులో మాత్రం ‘మోనిత మళ్లీ వస్తాను అంది కదా అని తలుచుకుంటూ ఆవేదన చెందుతాడు. ఇది ఇలా ఉంటే మోనిత కడుపులో వున్నా బిడ్డతో మీ నాన్నని చూశావ్ కదూ.. అందగాడు.. మంచివాడు అని మాట్లాడుతుంది. అదే విధంగా నువ్వు బయటికి వచ్చేలోగా నేను అన్నీ సెట్ చేస్తా అని చెబుతుంది.

మరునాడు హిమ, సౌర్య ఇద్దరూ తండ్రికోసమే మథనపడటం చూసి సౌందర్య ఆవేశం పెగిరిపోతుంది. అలానే ఆవేశంతో మీ అమ్మని ఏం అన్న ఊరుకోను అంటుంది. నెక్స్ట్ దీప కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. బయట నేల మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. దీప వెతుక్కుంటూ వెళ్తుంది. కాస్త దూరంగా ఉన్న పోలీసులు దీపతో.. అదిగో అమ్మా అక్కడే ఎదురుగా కూర్చున్నాడు చూడు అని చెబుతారు. రూమ్‌లో ఒక్కడినే ఉంటే ఏదోలా ఉంది అని కార్తీక్ చెప్పాలని ఆగిపోతాడు.

మోనిత ఎంత ప్రమాదమో దీపకు తెలియదు. మోనిత బతికే ఉంది అంటే వదిలిపెట్టదు అని అనుకుంటాడు. ఈలోగా దీప దేనికి భయపడుతున్నారు డాక్టర్ బాబు అని అడుగుతుంది. దీపా నేను బాగానే ఉన్నాను అని కార్తీక్ చెప్తాడు. నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారు.. ఆ నమ్మక ద్రోహి మోనిత ముందు నా నిజాయితీ ఎందుకూ పనికి రాకుండా పోయింది అని అంటాడు. దీనితో దీప ఇన్నాళ్లు మా అందరికీ మీరు ఉన్నారు.. కానీ ఇప్పుడు మీకు మేమంతా ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి అని దీప చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version