కార్తీకదీపం ఎపిసోడ్ 1232: కార్తీక్ ను మళ్లీ డాక్టర్ గా మారాలన్న దీప..బస్తీలో వంటలక్క ప్రజావైద్యశాల పెట్టిన మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో అలసిపోయాను దీప.. నేను ఏమి సాధించాను.. పేరు-హోదా అన్నీ పోయాయి అంటాడు. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వను అంటుంది దీప. లోపల ఛైర్ లో..దీప ఒళ్లో పడుకుని.. ఆస్తి మొత్తం ఇచ్చేసినా కోపం రాలేదా అంటే మీరే నా ఆస్తి డాక్టర్ బాబు.. ఆ పిలుపులోనే ఎంతో ఆనందం ఉంది తెలుసా అంటుంది దీప.

మరోసీన్ లో..రోడ్డుపై నడిచి వెళుతూ ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ చనిపోవడం, ఆ కుటుంబం పెట్టిన శాపనార్థాలు, ఆస్తి మొత్తం ఆ కుటుంబానికి ఇచ్చేసిన విషయాలు, డబ్బు చెల్లించకపోతే ఇద్దరి పిల్లల్లో ఒకర్ని తెచ్చుకుంటా అని రుద్రాణి చెప్పిన మాటలు అన్నీ తలుచుకుంటాడు. అప్పెలా తీర్చాలి, అంత మొత్తం ఎలా సంపదించగలను.. రుద్రాణి నా పిల్లలపై కన్నేసింది …మూడు లక్షల ఇరవై వేలు ఎలా తీర్చాలని ఆలోచిస్తాడు.

శౌర్య-హిమ
కడుపులో ఏదోలా ఉందన్న హిమతో..ఏం కాదులే ఇంటికెళ్లాక నాన్నతో చెప్పు అంటుంది శౌర్య. మన మిద్దరం అమ్మ చెప్పినట్టు అన్నింటికీ అడ్జెస్ట్ అవుదాం అంటుంది శౌర్య. ఇంతలో హిమకి వాంతి అవుతుంటే వెనకనుంచి వచ్చిన కార్తీక్ ఏం కాదులే భయపడకని చెబుతాడు. ఏమైంది నాన్న హిమ ఎందుకు వాంతి చేసుకుందని అంటే.. ఏదో చిన్న సమస్య మాత్రమే అని సర్ది చెబుతాడు. పిల్లలిద్దర్నీ తీసుకుని ఇంటికి వెళుతుంటే రుద్రాణి ఎదురుగా ఉంటుంది. ఏంటి సారూ పాప వాంతి చేసుకుందా..అమ్మా ఏమైంది ఈ ఊరు , ఈ గాలి కొత్త వాతావరణం పడలేదా అమ్మా.. ఆసుపత్రికి వెళదామా అమ్మా అంటుంది. నేను బాగానే ఉన్నా అంటుంది హిమ. అయినా మా నాన్ననే అని శౌర్య చెప్పబోతుంది. కార్తీక్ ఆపుతాడు. దీప తెలివైన అమ్మాయి అని రుద్రాణి మాట్లాడుతుంటే.. అడ్డు తప్పుకుంటే వెళతా అంటాడు కార్తీక్. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందన్న రుద్రాణితో మీరు జాలిపడాల్సిన అవసరం లేదంటి అని కార్తీక్ అంటే..నెల రోజుల్లో అప్పు తీరుస్తానని సంతకం పెట్టాను..గడువులోగా తీరుస్తా..ఎలా తీరుస్తానో- ఎలా సంపాదిస్తానో అని నా ఇష్టం అంటాడు కార్తీక్. చేతిలో డబ్బుల్లేకపోయినా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో అంటుంది. కార్తీక్ పదండమ్మా అని వెళ్తాడు.. సారూ పిల్లలు జాగ్రత్త అంటుంది. శౌర్య ఆ ఆంటీకి-మనకు ఏంటి గొడవ అన్న పిల్లలతో.. మనకేం లేదు కోటేష్ బాబాయ్ వాళ్లు కొంత డబ్బు ఇవ్వాలని చెబుతాడు కార్తీక్. హిమ ఇంకా ప్రశ్నలు అడుగుతుంటే..శౌర్య హమ వదిలేయ్..ఇవన్నీ మనకు అవసరం లేదుకదా పదా అంటుంది.

సౌందర్య ఇంట్లో
పిల్లల్ని తలుచుకుని సౌందర్య బాధపడుతుంటే..ఏమైంది శౌర్య-హిమ గుర్తొచ్చారా అని అడుగుతాడు ఆనందరావు. మర్చిపోతే కదండి గుర్తుకురావడానికి అంటుంది సౌందర్య. ఎప్పుడూ సంతోషంగా ఉన్నదే లేదు.. కార్తీక్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు, మోనిత ఇంట్లోకి వచ్చి చేరిందని బాధపడుతుంది. మోనిత రావడానికి..నేను ఒక కారణం..దోష నివారణ పూజ చేయించడంతో మోనితకి బలం పెరిగింది..రత్నసీతని కలిసిన విషయం చెప్తుంది. చూద్దాం అండి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అంటుంది.

శ్రీవల్లి బాబుకు జ్వరం రావడంతో టెన్షన్ పడుతుంది. కార్తీక్ చూసి..చుక్కల మందు వేసినప్పుడు జ్వరం రావడం సహజం.. మధ్య మధ్యలో తడి బట్టతో తుడవండని చెబుతాడు కార్తీక్. రేపు బాబుకి నామకరణం చేసుకోవచ్చా అని శ్రీవల్లి అడుగుతుంది. చేసుకోవచ్చు అంటాడు కార్తీక్. ఏ పేరు పెట్టాలనుకుంటున్నారని దీప అడిగితే ఆనంద్ అని శ్రీవల్లి చెబుతుంది. ఆ పేరెందుకు అని అడిగిన దీపతో… ఏమో తెలియదు అక్కా బాబుని దత్తత తీసుకొచ్చినప్పటి నుంచీ బాబుకి ఆనంద్ అనే పేరు పెడదాం అంటున్నాడు కోటేష్ అని చెబుతుంది. మోనిత బిడ్డకి ఆనందరావ్ అని పేరు పెట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు కార్తీక్. కాసేపటికి.. అంత్యాక్షరి ఆడుదాం అన్న శౌర్య మాటలు విని కార్తీక్ నవ్వుతాడు. అన్నింటినీ వదిలేసి ఇక్కడున్నాం కదా రౌడీ అంత్యాక్షరి ఆడుదాం అంటే నవ్వొచ్చింది అంటాడు.

దీప నేనొక విషయం చెప్పాలి అంటాడు. కార్తీక్ కూడా నేనొక విషయం చెప్పాలి అంటాడు. శౌర్య కూడా నెనొకటి అడగాలి అంటుంది. సరే శౌర్య నువ్వు ముందు అడుగు అంటే..అమ్మ …నాన్నని డాక్టర్ బాబు అని పిలిచేది కదా ఈ మధ్య కార్తీక్ బాబు అంటోందేంటని అడుగుతుంది శౌర్య…అవును అత్తమ్మ మా ఆయన్ని నేనెలా పిలిస్తే నీకెందుకు చెప్పు అని దీప అంటే… నేనిక్కడ డాక్టర్ అని ఎవ్వరికీ చెప్పొద్దన్నా కదా అందుకే అలా పిలవొద్దన్నా అంటాడు కార్తీక్. దీప నువ్వేదో చెప్పాలి అన్నవుగా ఏంటి అని కార్తీక్ అడిగితే.. నేను పిండి వంటలు చేసి అమ్మాలనుకుంటున్నా అని దీప చెబితే..వాటిని నన్ను అమ్మమనలేదు అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు అని పిలవడం మానేశాను కానీ నా మనసులో మీరెప్పుడూ డాక్టర్ బాబే అంటుంది దీప.

నేను ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నా అంటాడు కార్తీక్. బ్యాడ్ ఐడియా కాదు డాక్టర్..టీచర్ అవుతారన్నమాట అంటుంది శౌర్య. దీప అవసరమా కార్తీక్ బాబు..నేను చూసుకుంటానుగా అంటే.. నీ ప్రేమతో నన్ను ఏపనీ చేయనీయకుండా చేయొద్దు దీపా అని మాట్లాడుకుంటుంటే.. పిల్లలూ ఎలా ఉన్నారంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. రుద్రాణి తిన్నారా..ఏం వండారు అటూ మాట్లాడుతుంది. దీప పిల్లన్ని దగ్గరకు తీసుకుంటే.. కాసేపు పిల్లలతో మాట్లాడనివ్వు దీపా అని.. రుద్రాణి.. స్వీట్స్, పళ్లు, ట్యాబ్లెట్స్ తెప్పించానని అన్నీ శౌర్య-హిమకు ఇస్తుంది. వాళ్లు తీసుకోపోవడంతో… నీ పెంపకం గొప్పగా ఉంది దీపా అనేసి సంచి అక్కడే ఉంచేసి వెళ్లిపోతుంది. దీప దయచేసి అది తీసుకెళ్లండి అంటుంది. రుద్రాణి..కాదనుకు దీప..పిల్లలమీద ప్రేమతో తెచ్చాను అని పిల్లలు జాగ్రత్త అని వెళ్లిపోతుంది. శౌర్య ఏంటి నాన్న ఈవిడ ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది అంటే..నాకూడా అదే అర్థంకావటం లేదమ్మా అంటాడు. ఆవిడ గురించి మర్చిపోండి అంటుంది దీప.

పొద్దున్నే వంటగదిలో ఉన్న దీప దగ్గరకు వెళ్లిన కార్తీక్..రుద్రాణి వచ్చిందని మీరు కంగారు పడుతున్నారా అంటే..రుద్రాణి ఏంటో అర్థం కావడం లేదని..తన ఆలోచనలేంటో అంతు పట్టడం లేదంటాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

తరువాయిభాగంలో
దీప కార్తీక్ ని ఇక్కడొక ప్రజావైద్యశాల పెట్టాలి అంటుంది. మరోసీన్ లో బస్తీలో వంటలక్క ప్రజావైద్యశాలను మోనిత బోర్డ్ పెట్టి. మీకొక శుభవార్త అంటుంది. వీళ్లు ఏం ప్లాన్ చేశారు..అక్కడ మోనిత ఏం చేస్తుందో..మొత్తానికి శనివారం స్టంట్ వేశారు. సోమవారం ఏమైందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news