కార్వీ కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

-

కార్వీ కేసులో వెలుగులోకి షాకింగ్‌ నిజాలు వచ్చాయి. కార్వీ ఎండీ పార్థసారథి , చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిను నాలుగు రోజులు పాటు కష్టడీ కి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించారని.. వీరి ఇద్దరిపై PML యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ 2873 కోట్లు రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామమని.. HDFC బ్యాంక్ కార్వీ పై సీసీఎస్ కు ఫిర్యాదు చేసింది, ఆ FIR ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

గత ఏడాది సెప్టెంబర్ లోనే కార్వీ ఉద్యోగుల స్టేట్మెంట్ లు రికార్డ్ చేశామని.. సెక్యూరిటీలను దుర్వినియోగం చేయడానికి చేసిన మోసపూరిత ప్రణాళికలను ఈడీ వెలికితీసిందని పేర్కొన్నారు. పలు కంపిణీలు ద్వారా నిధులు ఎలా తారుమారు అయ్యాయో గుర్తించామమని.. ఈ కేసులో ఎండీ పార్థసారథి , కృష్ణ హరి లను ప్రధాన కుట్ర దారులు గా గుర్తించామన్నారు. బ్యాంక్ లనుండి తీసుకున్న రుణాలు , ఇతర కంపెనీలకు ఎలా బదిలీ చేశారో ఇన్వెస్ట్ గేషన్ లో గుర్తిచామని.. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించామని స్పష్టం చేశారు.

నిధులను దారి మళ్లించడానికి ఫైనాన్స్ కన్సల్టెంట్లు అలాగే పని చేయని NBFC లను ఉపయోగించారన్నారు. క్లయింట్ ల షేర్ లను తాకట్టు పెట్టి, ఐదు షెల్ కంపెనీల పేరుతో 400 కోట్లు రూపాయలు రుణాలు తీసుకున్నారని.. రుణాలు ద్వారా పొందిన నగదును వ్యక్తి గత కంపనీలకు బదిలీ చేశారని పోలీసులు వివరించారు.700 కోట్లు రూపాయలు పార్థసారథి కి చెందిన షేర్ హోల్డింగ్ ను సీజ్ చేశారు. సుమారు 2 వేల కోట్లు రూపాయలకు సంబంధించిన వసూలు పై ఈడీ దర్యాప్తు చేస్తుది. ఈ నెల 30 తేదీ వరకు ఇద్దరిని నాలుగు రోజుల పాటు కష్టడీ కి కోర్టు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news