మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు.. రేపు జంతర్ మంతర్‌లో కవిత ధర్నా ఉన్న తరుణంలో.. మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరుకానున్నారు కవిత. జంతర్ మంతర్ ధర్నా, ఈడి నోటీసుపై స్పందించనున్నారు కవిత.. ముందస్తు బెయిల్ కోసం BRS లీగల్ సెల్ చర్చలు జరుపుతున్నారు.
కాగా, దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్‌పై.. కవిత, కేసీఆర్‌లపై విరుచుకుపడుతోంటే.. బీఆర్ఎస్ మంత్రులు.. కేంద్రం వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. దర్యాప్తునకు సహకరిస్తానని స్పష్టం చేశారు.