టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఒక నిర్ధారిత ప్రదేశంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. అయితే తాను హైదరాబాదులో తన ఇంట్లోనే విచారణకు హాజరవుతానని కవిత అప్పటికప్పుడు సీబీఐకు సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆ నోటీసులకు సంబంధించి ఆమె లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం నా వద్దకు రావాలనుకుంటున్నారు సరే ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదుతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తనకు అందించాలని కోరారు కవిత.
సాధ్యమైనంత త్వరగా ఈ కాపీలను అందించాలని ఆమె సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ షాహీకి లేఖ రాశారు కవిత. తాను మీరు ఇచ్చిన నోటీసుల్లో విషయాలన్నీ పరిశీలించానని ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ కాపీతో పాటు కేసు పెట్టిన కంప్లైంట్ కాపీ కూడా అందజేయాలని కోరారు కవిత. మీరు డాక్యుమెంట్లను సమర్పిస్తే మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక మీరు అడిగినట్లు డిసెంబర్ 6వ తేదీ కాకుండా ఈ డాక్యుమెంట్లు నాకు అందిన తర్వాత మరోసారి విచారణ డేట్ ఫిక్స్ చేద్దామని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ విషయం మీద సీబీఐ ఎలా స్పందించబోతుందనేది తెలియాల్సి ఉంది. ఈ లేఖను ఈమెయిల్ ద్వారా అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా కవిత ఢిల్లీ సీబీఐ అధికారులకు పంపారు కవిత.