ఇకపై మిమ్మల్ని వదిలేది లేదు. ఎక్కడిక్కడ నిలదీస్తాం అంటూ బీజేపీకి కేసీఆర్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. వరిని వేయద్దని వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని బీజేపీని గురించి కేసీఆర్ విమర్శించారు. ఇవ్వాల్టి సమావేశంలో బీజేపీ తీరు అర్థం అయిందని కేసీఆర్ అన్నారు. బీజేపీ వస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని అన్నారు. సొల్లు పురాణం చెబుతూ రైతుల్ని మోసం చేసేలా బీజేపీ వ్యవహారం ఉందన్నారు. బీజేపీ ధాన్యం కొనేదాకా పోరాటం చేస్తామని వదిలేది లేదని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పెట్రోల్, డిజిల్ సెస్ ఎత్తివేస్తారా. .లేదా.. అని ప్రశ్నించారు. సెస్ ఎత్తివేసేదాకా మిమ్మల్ని వదిలేది లేదు అని అన్నారు. దేశంలో ప్రాజెక్ట్ లు కమీషన్ కోసమే కట్టారా.. ప్రాజెక్టు లు కడితే కమీషన్ల కోసమే అని.. కట్టకపోతే ప్రాజెక్ట్ లు ఎందుకు కట్టలేదని విమర్శిస్తారని ప్రతిపక్షాల గురించి కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ కమీషన్ల కోసమే కట్టారా..అని బీజేపీని ప్రశ్నించారు.
ఇకపై మిమ్మల్ని వదిలేది లేదు.. బీజేపీకి కేసీఆర్ వార్నింగ్.
-