అసెంబ్లీ వార్..కేసీఆర్ బిగ్ స్కెచ్..?

-

త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలే..ఎలక్షన్‌లో గెలిపించేవి కావాలనే విధంగా కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఊహించని విధంగా వరాలు కురిపించి..ప్రజలని ఆకట్టుకోవాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఎన్నికల ముందు జరగనున్న ఈ బడ్జెట్ సమావేశాలని సజావుగా సాగేలా చేయడానికి కే‌సి‌ఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతున్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా చూసుకోవాలని, అవసరమైతే ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడ కూడదని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం అసెంబ్లీలో పూర్తిగా హవా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలదే. ఇక ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 7 గురు ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యేలు,. ముగ్గురు బి‌జే‌పి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలాగో ఎం‌ఐ‌ఎం మిత్రపక్షం లాంటిదే కాబట్టి ఆ పార్టీ నుంచి ఎక్కువ ఇబ్బందులు రావు. కానీ ప్రస్తుతం బి‌జే‌పితో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా సరే బి‌జే‌పి ఏ మాత్రం తగ్గేలా లేదు.

పైగా అందులో ఈటల రాజేందర్ ఉన్నారు. గత అసెంబ్లీ సెషన్‌లో ఈటలని పూర్తిగా సస్పెండ్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఈటల పాల్గొంటారు. ఒకవేళ ఈటలని మాట్లాడనివ్వకుండా చేయాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. ఏదైనా మాట్లాడిన సస్పెండ్ చేసేలా ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. అటు రాజాసింగ్‌ ప్రస్తుతానికి బి‌జే‌పి సస్పెన్షన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గళం విప్పుతారా? లేదా? అనేది క్లారిటీ లేదు.

ఇటు రఘునందన్ సైతం గట్టిగానే మాట్లాడతారు..మరి ఆయనని ఎలా నిలువరిస్తారో చూడాలి. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా ఫోకస్ పెట్టారు. వారు ఏమైనా గట్టిగా మాట్లాడితే..వారిని నిలువరించడానికి వెనుకాడకూడదు అని చూస్తున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలని తమకు అనుకూలంగా మార్చుకుని, ఎన్నికల్లో సత్తా చాటాలని కే‌సి‌ఆర్ ప్లాన్.

Read more RELATED
Recommended to you

Latest news