BHEEMLA NAYAK : ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీ.. ‘హ్యాట్సాఫ్‌ సీఎం సార్‌’ అంటూ..

-

ప్ర‌పంచ వ్యాప్తంగా నిన్న ప‌వ‌న్ క‌ళ్యాన్, రానా క‌లిసి న‌టించిన “భీమ్లా నాయ‌క్” విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము లేపుతుంది. భీమ్లా నాయ‌క్ సినిమాపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమా చూడలేద‌ని కామెంట్ చేస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ రూపం చూశామ‌ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

అయితే.. భీమ్లా నాయక్‌ విడుదల నేపథ్యంలో.. ఏపీలోని థియేటర్లపై జగన్‌ సర్కార్‌ ఆంక్షలు విధించింది. జీవో 35 కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దీంతో కలెక్షన్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. ఏపీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ప్రశంసలతో ముంచెత్తారు.

భీమ్లానాయక్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని టికెట్ల ధరలు, ఇతర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకుంటూ.. విజయవాడలో కృష్ణ లంకకు చెందిన పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ”హ్యాట్సాఫ్‌ సీఎం సారు” అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోటోలతో ఉన్న భారీ ప్లేక్సీని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీ పై మరోవైపు వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news