తెలంగాణ రైతులకు సీఎం కెసీఆర్ గుడ్ న్యూస్..!

తెలంగాణ రైతులకు పథకాలు అందని ద్రాక్ష లాగా మారాయి..గత కొన్ని రోజులకు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలి కానీ తెలంగాణ సర్కార్ మొండి చెయ్యి చూపిస్తూ వచ్చింది.మొత్తానికి ఇప్పటికీ ప్రభుత్వం రైతుల పై కనికరం చూపింది.

రైతుబంధు సాయం ఈనెల 28 నుంచి రైతులకు అందనుంది. వానాకాలం పెట్టుబడి సాయాన్ని ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.అందుకు సంభందించిన చర్యలను తీసుకోవాలని సంభంధిత అధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఎప్పటి లాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది.

తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. వానాకాలం సీజన్‌కు రైతు బంధు కింద రూ.7,600 కోట్లు సాయం అదించే అవకాశం ఉంది..ఈ రుణం వల్ల రాష్త్రంలో పచ్చదనం పురివిప్పనుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.మొత్తానికి సీఎం ఇప్పటికైనా కనికరించాడు అంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.