ఈసీ నిబంధనలను కేసీఆర్ పుల్లంగించారని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. గులాబీ కూలి పేరుతో చాలామందిని టిఆర్ఎస్ నేతలు వేధించారని, ఈసీ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు ఏవి రూ. 20 వేలకు మించి నగదు తీసుకోవద్దని గుర్తు చేశారు. ఏటా చూపించవలసిన బ్యాలెన్స్ షీట్ కూడా టిఆర్ఎస్ చూపించడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలే వాళ్లకు వర్తిస్తాయని అన్నారు.
టిఆర్ఎస్ వసూళ్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని.. దానిపై విచారణ జరపాలని సిబిడిటి కి సీఈసీ లేఖ రాసిందని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ వసూళ్లపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. 8 ఏళ్లలో టిఆర్ఎస్ అవినీతిపై మోడీ విచారణకు ఆదేశించినట్లు బిజెపి చెప్పుకుంటుందని.. కెసిఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని నమ్మించే భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ – బిజెపి మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పుకునే కుట్ర జరుగుతుందన్నారు.