కొత్త ప‌థ‌కాల‌తో హుజూరాబాద్‌కు స‌ర్వం అర్పిస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఇంకో ప‌థ‌కం..!

-

ఎలాగైనా సరే తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ ను ఓడించాలనే కసి టీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. హుజూరాబాద్ లో ఎలాగైనా సరే గెలిచి తీరాలని అధినేత కూడా గట్టిగా ఫిక్సయినట్టున్నాడు. అందువల్లే హుజూరాబాద్ లో అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులతో ప్రచారం చేపిస్తూ…. ప్రచార వేడిని పెంచిన కేసీఆర్ తాజాగా దళిత బంధును ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

cm-kcr
cm-kcr

గతంలో కేసీఆర్ ఏ ఎన్నికను తీసుకోనంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికను తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమే గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. అక్కడ ఈటల రాజేందర్ ను ఓడించి పార్టీ నుంచి బయటకి వెళ్దామనే ఆలోచన ఎవరిలోనూ రాకుండా ఉండేందుకు స్కెచ్ వేస్తున్నాడ.

కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించడం అనుకున్నంత సులువు కాదనే విషయం కేసీఆర్ కు కూడా బాగా తెలుసు. అందుకోసమే ఇక్కడ అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. నేటి నుంచి కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయనున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలాగే నియోజకవర్గ వాసులకు కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తున్నారు. ఇవే కాకుండా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా అక్కడే స్టార్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎలాగైనా సరే నియోజకవర్గంలో ఈటలను ఓడించి టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని అధినేత గట్టిగానే డిసైడ్ అయినట్లు ఉన్నారు. అందుకోసం ఉన్న అన్ని వనరులను విరివిగా వాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news