హుజూరాబాద్ ఉపఎన్నిక లో కేటీఆర్ రూట్ వేరుగా ఉందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad bypoll)…రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వడం లాంటి అంశాలు తెలంగాణ రాజకీయాలని ఒక్కసారిగా వేడెక్కించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఉండే అంతర్గత రాజకీయాలతో పాటు ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి వివాదం నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.

KTR
KTR

ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతుంది. ఆ ప్రాజెక్టు అక్రమమని చెప్పి తెలంగాణ మంత్రులు, ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ నీటి యుద్ధం ఇలా జరుగుతుండగానే, హుజూరాబాద్ ఉపపోరులో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ జరుగుతుంది. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు వచ్చాక కూడా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది.

రేవంత్ సైతం టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ఇంత జరుగుతున్నా కూడా మంత్రి కేటీఆర్ మాత్రం తన పని తాను చేసుకుని వెళుతున్నారు. అసలు ఈ విషయాలపై ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు.

నీటి వివాదం గురించి స్పందించడం లేదు. హుజూరాబాద్ ఉపపోరు గురించి పెద్దగా మాట్లాడటం లేదు. అటు రేవంత్ చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కేవలం కేటీఆర్, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేసి ముందుకెళుతున్నారు. నిత్యం ఏదొక కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటున్నారు. ఈ విధంగా కేటీఆర్ రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ వివాదాలని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకెళుతున్నారు. మరి ఈ విషయంలో కూడా కేటీఆర్ స్ట్రాటజీ ఏమన్నా ఉందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news