కాళేశ్వరం అవినీతిలో కేసీఆరే దోషి.. మహేశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి అప్పులపాలు చేశాడని కమిషన్ తేల్చి చెప్పింది. ఇంజనీర్లు చెప్పింది కేసీఆర్ వినకుండా తన సొంత లాభం మాత్రమే కేసీఆర్ చూసుకున్నాడు.  తనకి ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చాడు.  రెండే పిల్లర్లు కుంగాయని అంటున్నారు.. ఇది సామాన్య విషయమా..? అని ప్రశ్నించారు.

PCC Cheif

ఇక  ఈ కార్ రేస్ లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా.. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్ళు కక్కక తప్పదు.  ఇతర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్న నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి.  ప్రతిపక్షాలు చేసిన కుట్రలతోనే ఇలా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే గ్రూపులే..  ఎన్ని గ్రూపులు ఉన్న ఎన్నికలు వచ్చేసరికి అందరూ ఒక్కటై పార్టీ కోసం పోరాడాలి. గ్రూపుల వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని హామి ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం అంటే అబద్ధాల పుట్ట.మీ చేతకానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టు వస్తుంది అని.. మేము మేల్కొని ఫిర్యాదు చేస్తే పనులు ఆగాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news