తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్. పాదయాత్రపై దాడి చేస్తే జనం బడితే పూజ చేస్తారని అన్నారు. దేవరుప్పల,అలంపూర్ లో యాత్రను అడ్డుకుంటే స్థానిక యువత తిరగబడ్డ సంగతి గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్. దేవురుప్పలలో మహిళలని చూడకుండా టీఆర్ఎస్ గూండాలు తప్పతాగి దాడి చేసి గాయపర్చారని.. అయినా తెగించి మహిళలు టీఆర్ఎస్ గూండాల దాడిని తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని దేశమంతా నివ్వెరపోతోందన్నారు.
యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నా మొద్దు నిద్రలో సీఎం ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో సీఎం కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు బండి సంజయ్. ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చినా జనం నుండి స్పందన లేదన్నారు. పాదయాత్రలో ప్రజా సమస్యలు వింటే తప్పా?..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పా? అంటూ ప్రశ్నించారు. నీ కూతురు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది గా.. పంజాబ్ తెలంగాణలో కూడా బయటకు వస్తుందన్నారు సంజయ్. బీజేపీ నాయకులు నిరసన తెలిపితే ఇష్టం వచ్చినట్లు కొట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా కార్యకర్తలను రాక్షసంగా కొట్టారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ పై చర్చ జరుగుతోందని కూతురును కాపాడుకొనేందుకు యాత్ర ను అడ్డుకున్నారని అన్నారు బండి సంజయ్. కూతురు పై ఆరోపనలు వచ్చాయి దమ్ముంటే సస్పెండ్ చెయ్ కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు.తన కూతురు స్కామ్ బయట పడుతుందని కెసిఆర్ డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపి నేతలకు అండగా జనం ఉంటున్నారు.. మీ బలం ఎంటో బీజేపీ పార్టీ బలం ఏంటో తేల్చుకుందామని అన్నారు.
పోలీసులు, అధికారులు డ్యూటీ చేయలేక బాధ పడుతున్నారని అన్నారు. 27 న జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వరంగల్ లో బహిరంగ సబకు వస్తారని ..మళ్లీ యాత్ర జరుపుతామన్నారు. లిక్కర్ స్కామ్ పై తగ్గేది లేదన్నారు. బీజేపీ కండువాలు వేసుకుని వచ్చి దాడులు చేశారని మండిపడ్డారు.