రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిశారు. ఇటీవల పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య మంగళవారం సోనియాగాంధీ రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిసి ఆమెను అభినందించారు. కాగా, ఇటీవల సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. అలాగే మనీ లాండరింగ్ కేసులో సీబీఐ విచారణకు కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో ఆయనతో చర్చించేందుకు హిమాచల్‌ప్రదేశ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజీవ్ శుక్లాను సంధికి పంపారు. చర్చ ముగిసిన తర్వాత ఆనంద్ శర్మ సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు పయనమైనట్లు సమాచారం.