మెగాస్టార్ చిరుకి గ‌రిక‌పాటి ఫోన్‌..!

-

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా.. రాగద్వేషాలకు అతీతంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు అసహనం వ్యక్తం చేశారు. దీంతో గరికపాటి ప్రవర్తనపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, గరికపాటి కూడా తన తప్పుని తెలుసుకున్నారని, శుక్రవారం చిరంజీవికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని, తాను ఏ ఉద్దేశంతో అలా అనాల్సివచ్చిందో వివరణ ఇచ్చారని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి అందిన ఇన్ సైడ్ టాక్. చిరు కూడా గరికపాటికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

ఈ రోజు గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ ఉంది. ఈ సందర్భంగా చిరు గరికపాటి ఎపిసోడ్ కి మీడియా సాక్షిగా ఓ ముగింపు వాక్యం పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ, గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో, గరికపాటి టాపిక్ రాకపోతే, ప్రత్యేకంగా ఓ వీడియో బైట్ రిలీజ్ చేసి, గరికపాటి వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news