తెలంగాణ జర్నలిస్టులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రెస్ క్లబ్ లో కూడా కంటి వెలుగు కార్యక్రమం పెడతాం జర్నలిస్ట్ లు, వారి కుటుంబాలకు టెస్ట్ లు చేస్తామని కీలక ప్రకటన చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు టెస్ట్‌లు చేస్తాయి. అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరికి మా బృందాలు వెళ్తాయి.రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించనున్నామని వివరించారు.
గ్రేటడ్ కమ్యూనిటీ,అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెడితే మీ దగ్గరికి కంటి వెలుగు బృందాలు వస్తాయి.ఒక్కో బృందం లో 8 మంది సిబ్బంది ఉంటారు. రోజు ఒక్కో బృందం 120 నుంచి 130 మందికి పరీక్షలు చేస్తాయని తెలిపారు. నివారించదగిన అంధత్వ సమస్యలు నిర్ములించాలన్నదే మా లక్ష్యం. 2018 మొదటి విడత కార్యక్రమం 8 నెలలో పూర్తి చేశామని తెలిపారు.