తెలుగుదేశం అధిష్టానం తీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయబోనని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు తేల్చి చెప్పేశారు ఎంపీ కేశినేని నాని. అంతేకాదు తన కుమార్తె కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోదని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని నాని.
ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయిందన్న నాని.. పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు వివరించారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా తాను పోటీ చేయబోనని చంద్రబాబుకు తెలిపిన నాని.. ఈ సారి వేరే అభ్యర్దిని చూసుకోవాలని చంద్రబాబుకు స్పష్టం చేశారు.
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో బుద్ధ వెంకన్న మరియు బోండా ఉమ తన పై… చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఎంపి కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలలో బుద్ధ వెంకన్న మరియు బోండా ఉమ చేసిన వ్యాఖ్యల నేపథ్యం లోనే.. విజయవాడలో చంద్రబాబు నాయుడు పర్యటన కు దూరంగా ఉన్నాడు కేశినేని నాని. ఇక తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను పోటీ చేయబోనని నారా చంద్రబాబు నాయుడు కు తేల్చి చెప్పేశారు ఎంపీ కేశినేని నాని. కానీ తాను టిడిపి లోనే ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది.