నిత్యం మీడియా ముందుకొచ్చి అధికార వైసీపీపై ఫైర్ అయ్యే నాయకుల్లో పట్టాభి ఒకరు. టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి…ప్రతిరోజూ మీడియాలో కనిపించకుండా ఉంటారు. ఎప్పుడు ఏదొక అంశంపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ప్రయత్నిస్తారు. ఒకోసారి టిడిపిలో పట్టాభి తప్ప, మాట్లాడే నాయకుడు మరొకరు లేరా అనే విధంగా కూడా పరిస్తితి ఉంటుంది. మరి అంతలా పట్టాభి మీడియా ముందు హడావిడి చేస్తారని చెప్పొచ్చు.
తాజాగా కూడా మద్యం, డ్రగ్స్ విషయంలో పట్టాభి…గట్టిగానే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. వైన్‌షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే ఎందుకు లేవు? కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? అని పట్టాభి ప్రశ్నించారు. జగన్‌లో నిజాయితీ ఉంటే వైన్ షాపుల్లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెట్టాలని, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రంగాల్లో డిజిటల్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి తీసుకురావాలని పట్టాభి డిమాండ్ చేశారు.
అయితే ఈ విషయంలో పట్టాభి పాయింట్ బాగానే ఉందని చెప్పొచ్చు…ఇప్పుడు ప్రతిచోటా డిజిటల్ ట్రాన్సక్షన్ ఉంటుంది…అలాంటప్పుడు వైన్ షాపుల్లో ఫోన్ పే, గూగుల్ పే లాంటిది పెట్టాల్సిన అవసరముందనే చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా పట్టుబడ్డ హెరాయిన్ కంటైనర్ విషయంలో పట్టాభి…జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డులో దుకాణాన్ని తెరిచి మరీ… టన్నుల టన్నుల హెరాయిన్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
అయితే హెరాయిన్‌కు జగన్‌కు సంబంధం ఏంటో అర్ధం కాకుండా ఉంది…అది కొందరి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అంశం…అయితే దీంతో జగన్‌కు సంబంధం ఉందని పట్టాభి పస లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు సీరియస్‌గా తమ పని తాము చేయడంలో బిజీగా ఉన్నారు. అలాంటప్పుడు దీనికి జగన్‌కు లింక్ పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు.