కేశినేని నానికి టికెట్ ఇచ్చినా..గెలిపిస్తా – కేశినేని చిన్ని

-

కేశినేని నానికి టికెట్ ఇచ్చినా..గెలిపిస్తానని టీడీపీ నేత కేశినేని చిన్ని సంచలన ప్రకటన చేశారు. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కేశినేని నానికి ఇచ్చినా, నాకు ఇచ్చినా వేరే ఎవరికీ ఇచ్చినా గెలిపించి తీరుతామని వెల్లడించారు.

చంద్రబాబు ఆదేశిస్తే విజయవాడ పార్లమెంటుకి నేను పోటీ చేస్తానని.. విజయవాడ పార్లమెంట్లో టీడీపీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవని వివరించారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే ఎజెండాగా అందరం కలిసి పని చేస్తున్నామన్నారు టీడీపీ నేత కేశినేని చిన్ని. చంద్రబాబు జీవిత చరిత్రని ప్రజలకు కళ్ళకి కట్టినట్టు చెప్పే ఉద్దేశంతోనే ఈ కథాగానాన్ని రూపొందించామన్నారు కేశినేని చిన్ని.

Read more RELATED
Recommended to you

Exit mobile version