BREAKING : బీహార్ అంశంపై అమిత్ షా నివాసంలో కీలక సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. ఇక ఈ సమావేశంలో జెపి నడ్డా, ఎల్ జెపి అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
బీహార్ లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు, జెడియుతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం అంశాలపై చర్చ నిర్వహిస్తున్నారు. అటు బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ అగ్రనేతలు చర్చలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, బీహార్ రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు నితీష్ కుమార్. ఇక రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం ఉండనుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్. నితీష్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.