ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్‌ఐ స్కామ్ ఎంత పెద్ద దూమారం లేపిందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ప్రస్తుతం ఈ ఈఎస్‌ఐ స్కామ్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ ఈఎస్‌ఐ స్కామ్ లో ఏసీబీ దర్యాప్తును మరింత వేగం పెంచింది. హైదరాబాద్ లో సూపరింటెండెంట్ రవి కుమార్ ను అదుపులోకి తీసుకున్నా ఏసీపీ అధికారులు.
సూపరింటెండెంట్ రవికుమార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. మెడికల్ ఎక్విప్ మెంట్ నిర్వహణ పేరుతో టీడీపీ పార్టీ హాయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఇప్పటికే ఈ ఈఎస్‌ఐ స్కామ్ లో కొంత మందిని అరెస్ట్ చేసిన అధికారులు సచివాలయంలో ఉన్న ఈఎస్‌ఐ అధికారులను విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఈఎస్‌ఐ స్కామ్ లో గతంలో తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు అచ్చె న్నాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకున్న సంగతి తెలిసిందే.