OTTలో KGF2..కానీ కండీషన్స్ అప్లయ్..అవేంటంటే?

-

శాండల్ వుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు కొనసాగింపుగా వచ్చిన సీక్వెల్ ‘ KGF చాప్టర్ 2’ను ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పిక్చర్ కు చక్కటి రెస్పాన్స్ వస్తోంది. కాగా, RRR ఈ నెల 20న OTT లోకి రాబోతున్న క్రమంలో చడీ చప్పుడు కాకుండా KGF2 కూడా ఓటీటీలోకి వచ్చేస్తుందన్న ప్రకటన వచ్చేసింది.

అయితే, ఇండియన్ బాక్సాఫీస్ పైన రాఖీభాయ్ వేట ఇంకా కొనసాగుతున్నదని చెప్పొచ్చు. బాక్సాఫీసు కా బాప్ రాఖీ భాయ్ అనేలా రికార్డు వసూళ్లు వస్తున్నాయి. కాగా, అమెజాన్ ప్రైమ్ OTTలోకి KGF2 రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. కానీ, కొన్ని కండీషన్స్ పెట్టారు. అవేంటంటే..ఈ సినిమా ఇప్పటికిప్పుడు చూడాలనుకునే వారు ఎర్లీ యాక్సెస్ లో భాగంగా రూ.199 చెల్లించాలంటూ ట్విటస్ట్ ఇచ్చారు.

సబ్ స్క్రిప్షన్ ఉన్నా లేకున్నా వారు కంపల్సరీగా రూ.199 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఒకసారి సినిమాను రెంట్ కు తీసుకున్న ట్లయితే నెల రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొన్నారు. అలా KGF2 ఓటీటీలో డిఫరెంట్ టైప్ కండీషన్స్ పెట్టడం గమనార్హం. జీ5 ఓటీటీ వేదికగా రాబోతున్న RRRకు కూడా ఇటువంటి కండీషన్స్ పెట్టారు . సినిమా చూడాలనుకునే వారు అదనంగా రూ.100 కట్టాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news