ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ రాజధాని హైద్రాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మీటింగ్ లో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి మరియు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ఎన్నో అంశాల గురించి మరోసారి గుర్తు చేశారు. ఈయన మాట్లాడుతూ … బీజేపీ మరియు BRS లు కాంగ్రెస్ ఏమిచేసిందంటూ విమర్శిస్తున్నారని , కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో మేము చేశామంటూ ఖర్గే చెప్పారు.. ఇంకా ఈయన మాట్లాడుతూ హరిత విప్లవం మరియు శ్వేతా విప్లవం కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలోనే డెవలప్ అయ్యాయంటూ బీజేపీ మరియు BRS పార్టీలకు అర్థమయ్యేలా తెలిపారు. ఎవ్వరికీ తెలియని మరో విషయం కంప్యూటర్స్ మరియు మొబైల్స్ ను సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల ముందుకు తీసుకువచ్చింది అంటూ గర్వంగా ఖర్గే చెప్పుకొచ్చాడు.