ఖుషి సినిమా సరికొత్త రికార్డు.. దేశంలోనే మొదటిసారి..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఖుషి డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. ఈ చిత్రాన్ని 4కె ప్రింట్ తో రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తుంది..

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా మళ్లీ విడుదల కావడానికి సిద్ధమవుతుంది ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్ళీ విడుదలయ్యి కాసులు వర్షం కురిపించాయి ఇందులో మహేష్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు సైతం ఉన్నాయి అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రాబోతుంది.. ఈ సినిమాను రిమాస్టర్ చేయించి విడుదల చేస్తుంది చిత్ర బృందం ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సినిమాను చూసిన అభిమానుల సైతం మళ్లీ బిగ్ స్క్రీన్ పైన చూడటానికి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అలాగే హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి సిటీస్ లో ఓ కొత్త స్ట్రెయిట్ మూవీ రిలీజ్ అవుతోందన్న రేంజ్ లో హంగామా జరగుతోంది. అలాగే ఈ సినిమాకు బెనిఫిట్ షోలు వేస్తున్నారు ఇండియాలో ఒక రీరిలీజ్ సినిమాకు బెనిఫిట్ షో వేయడం ఇదే బహుశా తొలిసారి కావచ్చు.. ఈ బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేస్తున్నారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలవుతున్న ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు.

2001 లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని అలరించింది అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ సినిమాను శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ సరసన భూమిక చావ్లా నటించింది ప్రస్తుతం ఈ సినిమాను ఆధునిక హంగులు జోడించి 4కె రిజర్వేషన్ తో మళ్ళీ విడుదల చేస్తున్నారు..

 

Read more RELATED
Recommended to you

Latest news