ప్రస్తుత కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. గతంలో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది . ఇక మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు లభించలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే స్టార్ హీరోలతో ఈమె నటించినప్పటికీ తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు మరొకసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో ఈమె నటిస్తోంది.
ఇదిలా ఉండగా కియారా అద్వాని ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ను ప్రేమించిందని.. కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అని పెద్ద ఎత్తున వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక రూమర్స్ పై అటు సిద్దార్థ్ కానీ ఇటు కీయారా కాని స్పందించలేదు. కానీ ఎట్టకేలకు తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన కియారా.. తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునే అంత సమయం లేదు అని, ఇలాంటి వార్తలను సృష్టించే వారు ఏం ఆశిస్తారో అర్థం కావడం లేదు అని ఆమె తెలిపింది. ఇక నా వ్యక్తిగత విషయాల గురించి కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే చర్చిస్తానని. ప్రస్తుతం కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టినట్లు ఆమె తెలిపింది.
ఇక నటిగా తానేమిటో నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నానని తెలిపింది కియారా అద్వానీ . ఇక త్వరలోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లూ టాక్ వినిపిస్తోంది . టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మడోన్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే .కాబట్టి ఇందులో ఈమె నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.