Breaking: అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల!

-

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఆర్మీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆర్మీలో ఉద్యోగం సాధించాలని అనుకునే వారికి ఊరట లభించింది. రేపు నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఈ నెల 24వ తేదీన ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.

అగ్నివీర్ నోటిఫికేషన్
అగ్నివీర్ నోటిఫికేషన్

దేశ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత సైన్యం కోరింది. నాలుగేళ్ల పాటు అగ్నివీర్‌లో శిక్షణ కొనుసాగుతుందని, జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. కాగా, అగ్నిపథ్ (అగ్నివీర్) స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చినా.. ఆరోపణలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news