కిడ్నీ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అసలు ఈరోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యా లేకుండా ఎవరూ లేరేమో కదా.. అందరికీ వాళ్ల వాళ్ల ఏజ్‌కు తగ్గట్టు ఏదో ఒక ఇబ్బంది ఉంది. ఏది లేదరా అంటే.. మానసిక ఆందోళన ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ అవడం ప్రాణంతకమే..మనం తినే పిచ్చాపాటి ఆహారాలే కిడ్నీలను దెబ్బతీస్తాయి. శీతలపానియాలు, కెఫిన్ ఉన్న కాఫీలు, ఫ్రీరాడికల్స్ పేరుకుపోయే ఆయిల్ ఫుడ్స్..అబ్బో చెప్పుకుంటూ పోతే బోలెడు. అయితే వీటితో పాటు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడే జ్యూస్‌లు కూడా తాగితే ఏ సమస్యా ఉండదు. కిడ్నీలు ఆరోగ్యానికి ఈ మూడు జ్యూస్‌లను ట్రై చేసేయండి మరీ..!
క్రాన్బెర్రీ జ్యూస్: క్రాన్బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన చికిత్స. మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీని కూడా శుభ్రపరుస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ బాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు, అవి చాలా ప్రాణాంతకంగా మారతాయి. క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీలో రాళ్లను కూడా నివారిస్తుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో ఏమీ జోడించకూడదు. కేవలం నీరు కలుపుకుని తాగితే చాలు.
అల్లం టీ: ఈ కాలంలో టీ తాగడం అందరికీ ఇష్టమే.. అయితే నార్మల్ టీ కాకుండా.. అల్లం టీని తాగేరంటే కిడ్నీలకు మంచిది… ఈ అల్లం టీని పాలు లేకుండా తాగితే అది కిడ్నీలకు మేలు చేస్తుంది. అల్లం కిడ్నీలో ఉండే మలినాలను బయటకు పంపుతుంది. శుభ్రమైన అల్లం తీసుకొని 5 నిమిషాలు నీటిలో ఉడకబెట్టండి. రుచికి సరిపడా చక్కెర వేసి తినాలి. ఇది కిడ్నీని సురక్షితంగా ఉంచడమే కాకుండా, జలుబుకు దూరంగా పెడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణ ఉంటుంది. శరీరంలో అంతర్గత ఇన్ఫెక్షన్లు ఉండవు.
రోజూ 2 నిమ్మకాయల రసాన్ని తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. మూత్రపిండాల నుండి విషాన్ని తొలగిస్తుంది. అదే సమయంలో, రోజూ 2 నుండి 2.5 లీటర్ల మూత్ర విసర్జన చేసే వ్యక్తులు కిడ్నీలో రాళ్లకు గురయ్యే అవకాశం తక్కువ ఉంటుందట. మీరు ఈ కిడ్నీ-హెల్తీ డ్రింక్ను ఉదయం, మధ్యాహ్నం తాగవచ్చు.
నిమ్మకాయతో పుదీనా : నిమ్మరసం, పుదీనా ఆకులు, కొద్దిగా చక్కెరను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలపి తాగడమే..
మసాలా లెమన్ సోడా: ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా.. సోడా కలపాలి. నీళ్లు పోసుకుని తాగండి.
.
కొబ్బరి షికంజీ: ఒక గ్లాసులో కొబ్బరి నీళ్లను నిమ్మరసం కలిపి తాగాలి. రుచి కాస్త వెరైటీగా ఉన్న ఆరోగ్యానికి మంచిది.
ఏం లేదండి.. కిడ్నీల ఆరోగ్యానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. రోజులో ఎలాగైనా రెండు నిమ్మకాయల రసం తీసుకునేందుకు ప్రయత్నించండి. అలా అని డైరెక్టుగా తీసుకుంటే పళ్లు దెబ్బతింటాయి. కడుపులో కూడా వికారంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఏదో విధంగా జ్యూసుల రూపంలో తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu