ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అగ్ర రాజ్యం ఐన అమెరికాకు మరో జలక్ ఇచ్చాడు. మరో సారి అమెరికా పై ఖండాంతర క్షిపణి ప్రయోగించాడు కిమ్. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా నాటు కూటమి నేతలు సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కిమ్ సరైన సమయం లో బరిలో దిగిన విధంగా కొత్త తరహా లో ఖండాంతర క్షిపణి ఐసీబీమ్ ను ప్రయోగించింది. సుదూర లక్షలను సుణాస్యాంగా చేరుకోగలదని చేప్తున్నారు. ఈ క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతాన్ని ఐన ఢీ కొట్టగలదని కిమ్ చెప్పుకొచ్చారు. ఈ తాజా క్షిపణి ని కిమ్ నేరుగా పర్యవేక్షించారు.
దీన్ని రాకాశి క్షిపణి గ చెప్తున్నారు. ఉత్తర కొరియా లో అమ్ముల పొదులో కీలక వెపన్ గా చెప్తున్నారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యము దీని సొంతం. ఈ ఏడాది ఆరంభం నుండి వరుస ఆయుధాలతో దూకుడు పెంచిన, గత 5 ఏండ్లలో ఐసీబీమ్ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2017 లో దీన్ని ఆ దేశం పరీక్షించింది, ఇది చాల శక్తి వంతమైదని అన్నారు. దాదాపు 6200 కి మీ, ఎత్తుకు వెళ్తుందని నిపుణుల మాట. తమది అణ్వస్త్ర దేశంగా గుర్తించాలని, తమపై ఆంక్షలను తొలగించాలని, అంతర్జాతీయ సమాజాన్ని డిమాండ్ చేస్తుంది. అందులో భాగమే ఈ తాజా ఐసీబీమ్ క్షిపణి. ప్రయోగం అని తెలుస్తుంది.