పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్… లక్ష పెట్టుబడితో మరో లక్ష రాబడి..!

-

ఈ మధ్యన ప్రతీ ఒక్కరు వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులని పెడితే చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర పేరుతో ప్రభుత్వ భరోసాతో ఓ పొదుపు పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలని చూద్దాం. నిర్ధిష్ట మొత్తంలో పెట్టుబడి పెడితే కొన్నేళ్ల తరవాత ఎక్కువ లాభం ఉంటుంది.

ఈ స్కీమ్ లో కనుక డబ్బులని పెడితే పది సంవత్సరాల తర్వాత ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇందులో మీరు పెట్టచ్చు. కనిష్ట పెట్టుబడి మాత్రం రూ.1000 నుంచి మొదలవుతుంది. ఎక్కువగా 7.2 శాతం వార్షిక వడ్డీను అందిస్తారు. మన దేశం లో వున్నలక్షా యాబై వేల పోస్టాఫీసుల్లో ఎక్కడైనా కూడా ఈ స్కీమ్ లో చేరచ్చు. 120 నెలల కాలానికి డబ్బులు డబుల్ అవుతాయి.

వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తూ ఉంటారట. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారు డబ్బులు పెట్టచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకం లో పెట్టుబడి డిపాజిట్ తేదీ నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలల కాలానికి లాక్ చేస్తారు. మెచ్యూరిటీ ఉపసంహరణ సమయంలో టీడీఎస్ మినహాయింపు ఉన్నా రిటర్న్స్‌లో మాత్రం పన్ను విధిస్తారు. ఒంటరిగా లేదా ఇద్దరు ముగ్గురు కలిసి దీనిలో డబ్బులని పెట్టవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version