తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వరదలు పెరిగి, గోదావరి పరివాహక ప్రాంతాలు మునిగి పోయాయి. ఈ నేపథ్యంలోనే.. నిన్న సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించి… నిర్వాసితులను పరామర్శించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.
క్లౌడ్ బరస్ట్ కారణంగానే.. ఈ వరదలు వస్తున్నాయని.. విదేశీయుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఫైర్ అయ్యారు. అయితే…సీఎం కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. క్లౌడ్ బస్టర్ నిజమైతే సాక్షాలు ఇవ్వండి సీరియస్ గా దర్యాప్తు చేపిస్తామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని.. తెలంగాణ, ఏపి లో గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరఖండ్ లో వరదలకు సంబంధించి క్లౌడ్ బరస్ట్ లో విదేశీ కుట్ర లపై కేసీఆర్ సాక్ష్యాలు ఇస్తే సీరియస్ గా విచారణ చేస్తామని.. ట్విట్టర్లో స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.