అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి కొనుగోలు అంశం చిచ్చురేపుతోంది. తాజాగా కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. కిషన్ రెడ్డికి ఎద్దులేదు.. ఎవుసం తెలియదు.. వ్యవసాయం గురించి ఏం తెలుస్తదని విమర్శించారు. కేంద్రమంత్రి రాష్ట్రానికి టూరిస్టుగా మారాన్నారు. బీజేపీ ఎంపీ సైకోగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గింజ కూడా కొననని చెబుతుంటే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ప్రతీ గింజ కొంటామంటున్నారు. కిషన్ రెడ్డికి చేతనైతే ఓ 10 వేల కోట్లతో వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు జీవన్ రెడ్డి. ఎంపీ అరవింద్ 10 లక్షల కోట్లను దేశం దాటించాడని విమర్శించారు. మీది స్మగ్లర్ల పార్టీ అని దుయ్యట్టారు.
కిషన్ రెడ్డికి ఎద్దు లేదు.. ఎవుసం తెలియదు- టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-