తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉంటారు… రేపు పోతారు… వ్యవస్థలు శాశ్వతమని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని.. కానీ తెలంగాణ గవర్నర్ ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బిజేపీ అని… కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
మునుగోడులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. కేసీఆర్ భయపడుతున్నారు… కొడుకును సీఎం చేయలేకపోతున్న అనే ఆందోళన లో ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబానికి మోడీ నచ్చకపోవచ్చు… దేశ ప్రజలకు మోడీ అంటే ఇష్టమని… కేసీఆర్ ని దేంట్లో ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్ములన జరిగిందా? రాష్ట్రంలో సమస్యలే లేవా ? అని నిలదీశారు. నిరాశ నిస్పృహ తోనే బండి సంజయ్ యాత్ర పై దాడి చేశారని నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.