తెలంగాణ రిపబ్లిక్ డే వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కెసిఆర్ కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదన్నారు. రిపబ్లిక్ వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనేక ఏళ్లుగా పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని.. అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయన్నారు.
రిపబ్లిక్ వేడుకలు గవర్నర్ జరపకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. అంబేడ్కర్ ను, రాజ్యాంగాన్ని కెసిఆర్ అవమానపరిచారని అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కెసిఆర్ డుమ్మా కొడుతున్నారని.. రాష్ట్రపతి, గవర్నర్ ను అవమానపరుస్తున్నరని బండి పడ్డారు. ముఖ్యమంత్రికి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయన్నారు.ఎవరూ ఈ రకంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలు, ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణలో జరుగుతుందన్నారు.