ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకు వచ్చిన టాప్ 5 స్కీమ్స్ ఇవే..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాలామంది ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే కేంద్రం ఆడపిల్లలకి కూడా ప్రత్యేకంగా కొన్ని రకాల స్కీములను తీసుకువచ్చింది. మరి ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకువచ్చిన టాప్ 5 స్కీముల గురించి ఇప్పుడు చూద్దాం.

బేటి బచావో బేటి పడావో:

బేటి బచావో బేటి పడావో స్కీం ద్వారా ఆడపిల్లలకి విద్యని అందించాలని కేంద్రం ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి అంటూ కేంద్రం ఇది ప్రవేశపెట్టింది. 100 కోట్ల నిధులతో ఈ స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది.

బాలిక సమృద్ధి యోజన పథకం:

కూతురు పుట్టినప్పటి నుంచి ఆమె చదువు అయ్యే దాకా అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం 1997 అక్టోబర్ 2న బాలికా సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. 15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలకి ఈ స్కీము వర్తిస్తుంది. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఖర్చు కేంద్రమే చూస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన పథకం:

ఆడపిల్లల ఉన్నత విద్య, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ముందు నుంచే పొదుపు చేయడానికి ఈ పథకం ఉపయోగ పడుతుంది. ఈ ఖాతా ని ఓపెన్ చేసేందుకు మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్‌కు వెళ్తే చాలు. అక్కడ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అప్లికేషన్ ఫామ్ ని తీసుకుని ఫిల్ చెయ్యాలి. బర్త్ సర్టిఫికెట్ జతచేయాలి గుర్తుంచుకోండి. అలానే ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలి. మీరు కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. కేవలం అమ్మాయిలకే ఇది వర్తిస్తుంది.

అమ్మాయి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అమ్మాయికి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు అకౌంట్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. బ్యాలెన్స్ ని ఆన్‌లైన్‌లో చెక్ చేయొచ్చు. దీనికి అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ బ్యాంకు నుంచి తీసుకోవాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు.

CBSE ఉదాన్ స్కీమ్:

కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ని కూడా ఆడపిల్లల కోసం తీసుకువచ్చింది. సీబీఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ లో చదువుతున్న ఆడపిల్లలకి ముఖ్యంగా వెనుకబడిన వారికి ఇది వర్తిస్తుంది. 11, 12వ తరగతిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్రయోజనం కలుగుతుంది. ఈ స్కీం బెనిఫిట్ ని పొందాలంటే ఆడపిల్లల తండ్రి ఆదాయం ఆరు లక్షల దాటి ఉండకూడదు.

నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్:

మూడు వేల రూపాయలని ఫిక్సెడ్ డిపాజిట్ ఇస్తారు. ఆడపిల్లకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక ఈ డబ్బులని తీసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news