అగ్నిపథ్‌పై బాంబు పేల్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..

అగ్నిపథ్‌ పథకం వెనక్కి తీసుకోవాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే అగ్నిపథ్‌ స్కీంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిప‌థ్ ప‌థ‌కం ఇప్పుడు రూపుదిద్దుకున్న ప‌థ‌కం కాద‌ని పేర్కొన్న కిషన్‌ రెడ్డి.. 1999లో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే ఈ ప‌థ‌కానికి బీజం ప‌డింద‌ంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిప‌థ్ ప‌థ‌కం వ‌ల్ల దేశానికి మంచే జ‌రుగుతుంది త‌ప్పించి ఎలాంటి కీడు జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌ని కూడా చెప్పుకొచ్చారు కిషన్‌ రెడ్డి. అగ్నివీరులుగా ఒక్క‌సారి ప‌నిచేస్తే.. యువ‌కుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని, త‌ద్వారా సైన్యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో యువ‌త మెరుగ్గా రాణిస్తుంద‌ని చెప్పారు కిషన్‌ రెడ్డి.

Union Minister G Kishan Reddy says Agniveers will be trained with skills of  drivers, barber

ఈ నేప‌థ్యంలో అగ్నిప‌థ్‌పై అన‌వ‌స‌ర రాజ‌కీయాలు చేయ‌రాద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు కిషన్‌ రెడ్డి. భార‌త సైన్యంలో ప‌నిచేయాల‌ని చాలా మంది యువ‌కులు భావిస్తున్నార‌ని, అలాంటి వారంతా అగ్నివీరులుగా చేర‌వ‌చ్చున‌ని చెప్పారు కిషన్‌ రెడ్డి. అగ్నివీరులుగా ప‌నిచేసిన త‌ర్వాత యువ‌త‌లో మెరుగైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయ‌ని చెప్పిన ఆయ‌న… వాటి ద్వారా అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించే అవ‌కాశం ఉంద‌న్నారు కిషన్‌ రెడ్డి. అగ్నివీరులంద‌రికీ మ‌హీంద్ర వంటి కంపెనీలు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చిన విష‌యాన్ని కూడా గుర్తు చేశారు కిషన్‌ రెడ్డి.