నీటి పంపకాలపై అపెక్స్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల వాదనను బలంగా వినిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. నీటి పంపకాలల్లో ఆరేళ్ళుగా అన్యాయం జరుగుతోంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రిలో దావత్ లు చేసుకున్నప్పుడు నీటి పంపకాల విషయం గుర్తు రాలేదా? అని నిలదీశారు. ఏపీతో నీటి సమస్యను పరిష్కరించుకుంటామంటే కేంద్రం వద్దంటోందా? అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీ నేతల సర్టిఫికేట్లు మాకు అవసరంలేదు అని స్పష్టం చేసారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలనేదే మా ఉద్దేశం అన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి పూనకం వస్తోంది అని ఆయన విమర్శించారు. రాజకీయ కారణాలతోనే వ్యవసాయ చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టంతో 70ఏళ్ళుగా రైతులకున్న నిర్భందాలు తొలగిపోయాయని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కావాలనే వ్యవసాయ చట్టంపై వితండ వాదం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.