సీఎం కేసీఆర్ కి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు విషయం గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. ” తెలంగాణ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సంబంధిత శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు 06 అక్టోబర్, 2021 నాడు Do. No. HMCA/2021/2142-F లేఖను మీకు వ్రాయడం జరిగింది. రాష్ట్రంలోని నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధిలో సాధించిన పురోగతి చాలా స్వల్పమనే చెప్పవచ్చు.

ఆయా విమానాశ్రయాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు మరియు విమానాశ్రయాలలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు వంటి ప్రాథమిక విషయాలలో ఏ మాత్రం పురోగతి సాధించకపోవడం చాలా విచారకరం. 1. వరంగల్ విమానాశ్రయం, 2. అదిలాబాద్ విమానాశ్రయం, 3. జక్రాన్ పల్లి విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రంలో పై మూడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయటంలో అవసరమైన సహకారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇది వరకే తెలియజేసినందున…

ఆ సహకారాన్ని అందిపుచ్చుకుని, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పైన తెలిపిన పనులను వీలయినంత త్వరగా పూర్తి చేసినట్లయితే మన రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.కావున, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయించి, కావలసిన సౌకర్యాలను కల్పించి విమానాశ్రయాలను వీలయినంత త్వరగా సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.”అంటూ లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news