Breaking : అభద్రతాభావంతోనే కేసీఆర్‌ కుటుంబం విమర్శలు చేస్తుంది : కిషన్‌రెడ్డి

-

సింగరేణిని ప్రైవేటీకరణ చేయడంలేదని మోదీనే చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కొందరు కావాలనే విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదన్నారు. అభద్రతాభావంతోనే కేసీఆర్‌ కుటుంబం విమర్శలు చేస్తుందన్నారు. యూపీఏ హయాంలో రూ.1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బొగ్గు బ్లాక్‌ల వేలంలో పారదర్శకత ఉండేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. ఓయూ ప్రభుత్వ పాఠశాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్‌ను ఆయన పంపిణీ చేశారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NTPC సహకారంతో మిషన్ల పంపిణీ జరిగింది. క్లీనింగ్ మిషన్‌తో టాయిలెట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుభ్రం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version