తెలంగాణ రైతలుకు శుభవార్త.. కేసీఆర్‌ కీలక నిర్ణయం

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఎస్‌ శాంతి కుమారికి సూచించారు. ఈ సీజన్‌లో 7వేల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

CM KCR expresses grief over demise of Sharad Yadav

ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లను తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేయనున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించిన పంట దళారులకు విక్రయించి మోసపోకుండా.. మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి గ్రేడ్‌ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news