ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. 15 పాయింట్లతో ఉన్నలక్నో ఈ మ్యాచ్‌లో గెలిచి ఫ్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలిని భావిస్తోంది. అయితే.. సొంత గడ్డపై విజయం సాధించి టోర్నీని ముగించాలని కోల్‌కతా పట్టుదలతో ఉంది.
గత మ్యాచ్‌లో దంచిన మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా లక్నోకు కీలకం కానున్నారు. మరోవైపు నితీశ్ రానా సేన స్పిన్న త్రయాన్ని నమ్ముకుంది. ఫినిషర్ రింకూ సింగ్ ఉండనే ఉన్నాడు. ఈ మ్యాచ్ ఫలితం ప్లే ఆఫ్స్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చనుంది. దీంతో, అందరి దృష్టి ఈ గేమ్‌పైనే ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి