ఐపీఎల్ లో ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు ఈ సీజన్లో తమ రెండవ మ్యాచుని ఆడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్, బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. క్వింటన్ డికాక్ 10పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యాన్ని కుదిర్చాడు. 10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే ఇషాన్ కిషన్ కూడా వెనుదిరిగాడు.
మొత్తానికి 20ఓవర్లు ముగిసే సమయానికి ముంబై జట్టు అన్ని వికెట్లు కోల్పోయి 152పరుగులు చేయగలిగింది. ముంబై బ్యాట్స్ మెన్లలో సూర్యకుమార్ యాదవ్ 56పరుగులు (36బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), రోహిత్ శర్మ 43పరుగులు ( 32పరుగులు 3ఫోర్లు, 1సిక్సర్) చేసారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ ఐదు వికెట్లు తీసుకోగా, పాట్ కమ్మిన్స్ 2వికెట్లు, వరుణ్ చక్రవర్తి, షకిబ్ అల్ హసన్, ప్రసీద క్రిష్ణ తలా ఒక వికెట్ తీసుకున్నారు.