సాయంత్రం స్నాక్స్: కరకరలాడే చికెన్ స్ట్రిప్స్.. తయారు చేసుకోండిలా..

-

కరోనా మహమ్మారి కారణంగా చికెన్ ఎక్కువ తినమని చాలామంది చెబుతున్నారు. చికెన్ లో ఉండే ప్రోటీన్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఐతే చికెన్ ని సాధారణంగా కాకుండా వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెస్టారెంట్లలో ఇలాంటి వెరైటీలు చాలా ఉంటాయి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకుని ఆరగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకుని మీకు ఇష్టమైన వాళ్ళతో పాటు ఆరగిస్తే ఆ అనుభూతే వేరు. సాయంత్రం పూట అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన సమయాన, హాయిగా చికెన్ స్ట్రిప్స్ తింటే ఆ అనుభవం చాలా రోజులు గుర్తుండిపోతుంది. మరెందుకాలస్యం చికెన్ స్ట్రిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

3 ఎముకలు లేని చికెన్ ఛాతి పీసులు
2గుడ్లు
1టేబుల్ స్పూన్ నిమ్మరసం
1టేబుల్ స్పూన్ ఉప్పు
అరచెంచా మిరియాలు
1టేబుల్ స్పూన్ మిరపకాయ
ఒక కప్పు- అన్ని రకాలకి ఉపయోగపడే పిండి
ఒక కప్పు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్
అరచెంచా వెల్లుల్లి పొడి

పద్దతి:

ముందుగా చికెన్ ని స్ట్రిప్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాత్రలో 2గుడ్లు పగలగొట్టి దానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి.

ఇప్పుడు మరో పాత్రలో అన్ని రకాలకి ఉపయోగపడే పిండి తీసుకుని దానికి బేకింగ్ పౌడర్ కలపాలి. చివరగా కారం, ఉప్పు, వెల్లుల్లి పొడి, మిరియాలని కలపాలి. చికెన్ ముక్కల మీద ఈ మిక్స్ ని బాగా కవర్ చేయాలి.

ఆ తర్వాత గుడ్డు మిక్స్ ని చెకెన్ ముక్కలపై కోటింగ్ చేయాలి. ఇదే పద్దతిని రెండు సార్లు చేయాలి. ఆ తర్వాత చిన్నమంట మీద పెట్టి బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి.

20నిమిషాలు ఓవెన్ లో పెట్టుకుని హాయిగా తినండి. సాయంత్రం పూట మీకు నచ్చిన చికెన్ స్ట్రిప్స్ ని హ్యాప్పీగా ఆరగించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version